Thursday 13 May 2021

Elon musk comments on bitcoin

 Bitcoin: ‘ఒక్క ట్వీట్‌తో ఎంత పనిచేశావ్‌ మస్కో’!

మస్క్‌ నిర్ణయం సోషల్‌మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌

Bitcoin: ‘ఒక్క ట్వీట్‌తో ఎంత పనిచేశావ్‌ మస్కో’!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తన కంపెనీ అయిన టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తామని గతంలో చెప్పిన మస్క్‌.. తాజాగా తన నిర్ణయం మార్చుకున్నారు. సదరు క్రిప్టోకరెన్సీని ఇకపై తన కార్ల కంపెనీ కొనుగోలుకు వినియోగించేందుకు అనుమతించేది లేదని ట్వీట్‌ చేశారు. బిట్‌కాయిన్‌ కోసం భారీగా విద్యుత్‌ ఖర్చు చేయాల్సి వస్తోందని, తద్వారా పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోందని మస్క్‌ పేర్కొన్నారు. కాబట్టి ఇకపై బిట్‌కాయిన్‌ను టెస్లా కార్ల కొనుగోలుకు అంగీకరించబోమని చెప్పారు.

మస్క్‌ ప్రకటనలతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ క్షీణించింది. దాదాపు 15 శాతం క్షీణించి 46వేల డాలర్ల పైన ట్రేడవుతోంది. అక్కడికి కాసేపటికే సోషల్‌మీడియాలో వెంటనే మీమ్స్‌, ట్రోల్స్‌ మొదలయ్యాయి. గతంలో ఇదే మస్క్‌ బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించడం వల్లే  దాని విలువ అమాంతం పెరిగిందని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని మస్క్‌ నిర్ణయాలపై బిట్‌కాయిన్‌ విలువ ఆధారపడి ఉందంటూ మీమ్స్‌ రూపొందిస్తున్నారు. మరికొందరైతే ఇప్పుడే మస్క్‌కు పర్యావరణం గురించి గుర్తొచ్చిందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కార్ల వల్ల పర్యావరణానికి హాని జరగడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ మీమ్స్‌ మీరూ చూసేయండి..


No comments:

Post a Comment

Follow Us @soratemplates