Google: వినియోగదారులకు భారీ షాకిచ్చిన గూగుల్.. జూన్ 1 నుంచి ఆ సేవలకు డబ్బులు చెల్లించాల్సిందే.. వివరాలివే..
Google Photos: టెక్ దిగ్గజం గూగుల్ తన ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఉచితంగా అందించిన పలు సేవలకు ఇక డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
- NEWS18 TELUGU
- LAST UPDATED: MAY 15, 2021, 11:13 IST
మీకు గూగుల్ అకౌంట్ ఉందా? మీ ఫోటోలు, వీడియోలను గూగుల్ ఫోటోస్ యాప్‌లో ఉచితంగా స్టోర్ చేసుకుంటున్నారా? అయితే ఇకపై అలా కుదరదు. ఇందుకు డబ్బు చెల్లించాల్సిందే. గత కొన్నేళ్లుగా గూగుల్ ఫోటోస్, డ్రైవ్‌లో ఫోటోలు, వీడియోలను ఉచితంగా సేవ్ చేసుకునే సౌలభ్యమిచ్చింది గూగుల్ సంస్థ. అయితే జూన్ 1 నుంచి ప్రీమియం వెర్షన్‌కు మారి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఫోటోలు, వీడియోల ఉచిత బ్యాకప్‌ను ఆపివేయనున్నట్లు గూగుల్ గతేడాదే ప్రకటించింది. ఇప్పటివరకు హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు నిల్వ చేసేందుకు గూగుల్ ఫోటోస్, డ్రైవ్‌లో 15జీబీ స్టోరేజి లిమిట్ ఉంది. ఇందులో స్టోర్ చేసుకున్న బ్యాకప్ ఫైల్స్‌ను ల్యాప్ టాప్‌లో లేదా కంప్యూటర్లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశమిచ్చింది. అయితే జూన్ 1 నుంచి ఈ అవకాశం లేదు. ఒకవేళ ఈ సేవను ఉపయోగించుకోవాలంటే గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకొని ప్రీమియం చెల్లించాలి.
Fake Google Chrome: 'గూగుల్ క్రోమ్' పేరుతో నకిలీ యాప్... వెంటనే డిలిట్ చేయండి
\1\6వివిధ రకాల ప్లాన్లు..
జూన్ 1 తర్వాత గూగుల్ అనుబంధ సర్వీసులైన జీమెయిల్, డ్రైవ్, గూగుల్ పోటోస్‌లో డేటా లిమిట్ 15జీబీ వరకు ఉచితంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ డేటా అవసరమైతే గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందుకు రకరకాల ప్లాన్లు అందుబాటులో ఉండనున్నాయి. 100 జీబీ డేటా నుంచి 30 టీబీ క్లౌడ్ స్టోరేజ్ వరకు వివిధ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది యాపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌కు సమానంగా ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అదనపు బెనిఫిట్లు ఉంటాయి. ఈ ప్రీమియం ప్లాన్స్ ద్వారా అదనంగా సభ్యులను కూడా యాడ్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఇందులో భాగం చేయడానికి అనుమతిస్తుంది. భారత్ మినహాయించి ఎంచుకున్న దేశాల్లో వినియోగదారులు గూగుల్ వీపీఎన్ సర్వీస్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
గూగుల్ వన్ యాప్..
100 జీబీ గూగుల్ ప్లాన్ తీసుకోవాలంటే నెలకు రూ.149 చెల్లించాలి. ఏడాదికైతే ధర రూ.1499 ఉంటుంది. 200 జీబీ ప్లాన్‌కు నెలకు రూ.219, సంవత్సరానికి రూ.2199 ఖర్చు అవుతుంది. అనంతరం 2టీబీ ప్లాన్ అయితే నెలకు రూ.749, సంవత్సరానికి రూ.7,500 ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్స్ గూగుల్ వన్ యాప్ ఉన్న ఐఓఎస్ యూజర్లకు మరింత చౌకగా లభించనున్నాయి. బేసిక్ ప్లాన్ అయిన 100 జీబీ రూ.130, ఏడాదికి 1300లకు వస్తుంది. 200 జీబీ ప్లాన్ నెలకు 210, ఏడాదికి 2100 చెల్లించాలి. 2టీబీ ప్లాన్ నెలకు రూ.650, ఏడాదికి రూ.6500 చెల్లించాలి.
ఇవి కాకుండా 10టీబీ, 20టీబీ, 30టీబీ ప్లాన్స్ కూడా నెలవారీ అందిస్తుంది. ఈ ప్లాన్స్ తీసుకోవాలంటే నెలకు రూ.3249, రూ.6500, రూ.9700లు చెల్లించాలి. ఈ మూడు ప్రణాళికలు గూగుల్ వన్ యాప్ లోనే లభిస్తాయి. గూగుల్ వన్ యాప్ యూజర్ల కోసం ప్లాట్ ఫాం వారీగా బ్యాకప్, స్టోరేజీని నిర్వహించడానికి అనుమతిస్తుంది. వినియోగదారుల ఈ యాప్ ద్వారా గూగుల్ సపోర్ట్ ను కూడా ఉపయోగించవచ్చు.